ఇంటర్నెట్ డెస్క్: గుండె జబ్బులు కారణమయ్యే అంశాలు క్యాన్సర్ ముప్పుకు దారి తీస్తాయి. అయితే, హృదయ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లల్లో కలిగే శారీరక మార్పులు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.
గుండె జబ్బు కారణంగా శరీరంలో దీర్ఘకాలం పాటు ఇన్‌ఫ్లమేషన్ కొనసాగుతుంది. ఇది కణాలు, వాటి డీఎన్ఏలో ప్రమాదకరమైన మార్పులు చేసి క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. లివర్, లంగ్స్, కొలాన్‌పై ఈ ప్రభావం ఎక్కువ.
గుండె జబ్బులు ఉన్న వాళ్లల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఎక్కువే. ఫ్రీరాడికల్స్ కారణంగా కణాలను డ్యామేజ్ చేస్తాయి. డీఎన్ఏలో కూడా హానికర మార్పులు చోటుచేసుకుని చివరకు క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది (Health).
BP: బీపీ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద సూచనలు ఫాలో కావాలి
గుండె జబ్బులు రక్తప్రసరణకు ఆటంకాలు కలిగిస్తాయి. దీంతో, శరీరంలోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు పూర్తిస్థాయిలో అందవు. ఫలితంగా కణాలు బలహీనమైన హానికర మార్పులు తలెత్తుతాయి. దీంతో, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లల్లో రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఫలితంగా రోగ నిరోధక కణాలు.. క్యాన్సర్ ముప్పు ఎక్కువైన కణాలను గుర్తించి తొలగించలేవు. అంతిమంగా ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
గుండె జబ్బులు కలుగ జేసే ఊబకాయం, ధూమపానం, హై బ్లడ్ షుగర్, పోషకాలు లేని ఆహారం తినడం వంటివన్నీ క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతాయి.
జీవనశైలి సంబంధిత వ్యాధుల కారణంగా జీవక్రియల్లో మార్పు చోటుచేసుకుంటుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలో, ఇన్సులీన్ పనితీరు మందగించడం వంటి మార్పులు కలుగుతాయి. ఇవన్నీ క్యాన్సర్ కారక కణాల పెరుగుదలకు తగిన వాతావరణం సృష్టిస్తాయి. దీంతో, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
Noise Cancelling Headphones: అలర్ట్.. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడుతారా? అయితే..
గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సగా వాడే కొన్ని ఔషధాలు కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్ రిస్క్ పెంచే అవకాశాలు కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఔషధాలు క్యాన్సర్ సంబంధిత జీవక్రియలపై ప్రభావం చూపడమే ఇందుకు కారణమని అంటున్నారు.
వీటికి తోడు గుండె సంబంధిత సమస్యలున్న వారిలో కనిపించే హార్మోన్ స్థాయిల్లో మార్పులు, అధికకాలం పాటు కొనసాగే ఒత్తిడి, అధిక కార్టిసాల్ స్థాయిలు వంటివన్నీ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.
Liver Health: మీకు ఈ అలవాట్లు ఉంటే.. లివర్‌కు ముప్పు పొంచి ఉన్నట్టే
Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!
Read Latest and Health News