Calcium Deficiency: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? కాల్షియం లోపిస్తే ఇలా జరుగుతుంది..!

Written by RAJU

Published on:

కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరంలో ఎముకలు బలంగా ఉండాలన్నా, ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకూడదన్నా కాల్షియం ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి కాల్షియం సరిగా అందకపోతే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. అవి కాల్షియం లోపం లక్షణాలు అనే విషయం కూడా వారికి తెలియదు. శరీరంలో కాల్షియం లోపాన్ని హైపోకాల్సెమియా అని అంటారు. ఈ కింది లక్షణాలను బట్టి కాల్షియం లోపాన్ని గుర్తించవచ్చు.

గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

  • శరీరంలో కాల్షియం తక్కువగా ఉంటే పార్కిన్సన్ వ్యాధి వస్తుంది. శరీర కణాలకు కాల్షియం అందకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. గందరగోళం, జ్ఞాపకశక్తిలో మార్పులు ఏర్పడతాయి. క్రమంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.

  • ఎప్పుడూ అలసటగా ఉండేవారిలో కాల్షియం లోపం ఉండే అవకాశం ఉంది. కానీ దీన్ని చాలామంది సాధారణ సమస్యగా భావిస్తారు. ఒళ్ళంతా నొప్పులు, శరీరం దృఢత్వం లేకపోవడం, మూడ్ సరిగా లేకపోవడం, హైపోకాల్సెమియా వంటివి అలసటకు కారణం అవుతాయి. ఇవన్నీ కాల్షియం లోపం వల్ల వస్తాయి.

  • దంతాలు బలహీనంగా మారడం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, చిగుళ్లలో రక్తం కారడం, దంతాల నొప్పులు వంటివి కూడా కాల్షియం లోపాన్ని సూచిస్తాయి.

జీలకర్ర నీరు ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..!

  • కాల్షియం కేవలం ఎముకలకు మాత్రమే ముఖ్యం అనుకుంటే పొరపాటు. ఇది కండరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా అవసరం. కండరాల సంకోచానికి, కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి కాల్షియం అవసరం. కాల్షియం లోపం ఉంటే కండరాల నొప్పులు, కండరాలు దృఢత్వంగా లేకపోవడం జరుగుతుంది.

  • కేంద్రనాడీ వ్యవస్థలలో వివిధ భాగాలు పనిచేయడానికి కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం ఉన్నట్టైతే చేతులు, వేళ్లు, పాదాలు, కాలి భాగంలో నరాలు ప్రభావితం అవుతాయి.

  • కాల్షియం లోపం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు గుండె కొట్టుకునే వేగంగా మార్పులు ఉంటాయి. కొన్ని సార్లు గుండె వేగం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!

టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights