
ఈ బటర్ బన్ తీపి రుచి మెత్తని ఆకృతి వల్ల పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ అవుతుంది. దీన్ని ఒక ట్రీట్‌గా ఇంట్లో తయారు చేస్తే పిల్లలు ఆనందిస్తారు. ఈ బన్‌లో వెన్న ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణ వెన్నతో పాటు, కొన్ని చోట్ల తెల్ల వెన్న ఉపయోగిస్తారు, ఇది దాని రుచిని మరింత పెరిగిపోతుంది. మధురైలో రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాల్లో ఈ బటర్ బన్ సాయంత్రం నుండి రాత్రి వరకు లభిస్తుంది. కొన్నిసార్లు దీన్ని తామర ఆకులపై వడ్డిస్తారు, ఇది దాని రుచికి ఒక ప్రత్యేకమైన సుగంధాన్ని జోడిస్తుంది. స్వీట్లు ఎక్కువగా ఇష్టపడే వారికి బటన్ బన్స్ అనువైన ఎంపిక. మధురై నగరం అనేక మాంసాహార వంటకాలు ప్రసిద్ధి. అయినప్పటికీ ఈ బటర్ బన్ కు అక్కడ చాలా మంది ఫ్యాన్సే ఉంటారు. తమిళనాడులోని మధురై స్పెషాలిటీ అయిన బటర్ బన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
సాఫ్ట్ బన్ – 2
వెన్న – 3 టేబుల్ స్పూన్లు
చక్కెర – 2 టేబుల్ స్పూన్లు
క్రీమ్ / మిల్క్‌మెయిడ్ – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి – అవసరమైనంత
తయారీ విధానం..
తాజా స్వీట్ బన్‌ను సగానికి కట్ చేయండి.
రెండు వైపులా వెన్నను ఉదారంగా పూయండి.
చక్కెరను చల్లి, కొద్దిగా పాలను జోడించండి.
బన్‌ను మూసివేసి, పైన కూడా వెన్న, చక్కెర చల్లండి.
ఒక పాన్‌లో వెన్న కరిగించి, బన్‌ను రెండు వైపులా తక్కువ మంట మీద బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. కొన్నిసార్లు మధ్యలో పాలను జోడించి, బన్‌ను చపాతీ లాగా ఒత్తుతూ కాల్చడం వల్ల అది మరింత మెత్తగా మారుతుంది.
వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి, ఒక కప్పు టీ లేదా కాఫీతో దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
గమనిక: ఈ బన్ తాజాగా తయారు చేస్తేనే రుచిగా ఉంటుంది, ఎందుకంటే దీన్ని నిల్వ చేయడం వల్ల వెన్న గట్టిపడి, రుచి తగ్గుతుంది.