Jute Crop: సాధారణంగా చాలా వ్యాపారాల్లో లాభాలు 10-20శాతం ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి అగ్రికల్చర్ బిజినెస్‌లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఒక పంట పండిస్తే సులభంగా 60 శాతానికి పైగా ప్రాఫిట్ సంపాదించవచ్చు. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉండి. పర్యావరణానికి అనేక ప్రయోజనాలు అందిస్తున్న ఆ పంట పేరు జనపనార. దీని సాగుతో మంచి లాభాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.
దేశంలో నేల, వాతావరణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక పంటలను పండిస్తారు. ఈ పంటలలో జనపనార కూడా ఉంటుంది. తూర్పు భారతదేశంలోని రైతులు పెద్ద ఎత్తున జనపనారను పండిస్తారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిశా, బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, మేఘాలయ ప్రధాన జనపనార ఉత్పత్తి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. దేశంలోని దాదాపు 100 జిల్లాల్లో జనపనార పంటను ప్రధానంగా పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం జనపనార ధరలను భారీగా పెంచింది. దీని వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. ప్రపంచ జనపనార ఉత్పత్తిలో భారతదేశం 50 శాతం వాటా కలిగి ఉంది. జనపనార బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్‌లలో ఉత్పత్తి అవుతుంది.
జనపనార అంటే ఏమిటి?
ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన సహజ ఫైబర్లలో ఒకటి. భారత్‌లోని రైతులు జనపనార పంటతో భారీ లాభాలు అందుకోవచ్చు.
జనపనార ఉపయోగాలు: జనపనార అనేది ఒక నేచురల్ ఫైబర్. దీనిని వివిధ పరిశ్రమలలో అనేక ఉపయోగాలకు వాడతారు. భారతదేశంలోని రైతులకు లాభదాయకమైన పంటగా ఉన్న దీనిని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. జనపనార మొక్క వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతుంది. సాధారణంగా మార్చి – ఏప్రిల్ మధ్య గోధుమ, ఆవాల పంట తర్వాత జనపనార విత్తనాలు విత్తుతారు. ఈ మొక్క పొడవాటి, సిల్కీ, మెరిసే ఫైబర్లను కలిగి ఉంటుంది. వీటిని ముతక దారాలు లేదా నూలులుగా మార్చవచ్చు. ఈ జనపనారా బుట్టలు, రగ్గులు, కర్టెన్లు, ప్యాకింగ్ బ్యాగ్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఈ దారాలు లేదా నూలులను ఉపయోగిస్తారు. జనపనార ముఖ్యంగా ధాన్యం బస్తాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బలంగా, మన్నికగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి