ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు కాఫీ తాగనిదే కొందరు బెడ్ దిగలేరు. కొందరికి కాఫీలో పాలు, చక్కెర ఉంటేనే బాగుంటుంది. మరికొందరు బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. కానీ, ఇటీవల బుల్లెట్ కాఫీ పేరుతో ఓ కొత్త వెరైటీ పాప్యులర్‌గా మారింది. సాధారణ బ్లాక్ కాఫీకి ఒక స్పూను వెన్న లేదా నెయ్యి జోడించి దీన్ని తయారు చేస్తారు (Bullet Coffee Pros and Cons).
ఒంట్లో కొవ్వు కరిగించుకునేందుకు ఈ బుల్లెట్ కాఫీ ఉపయోగపడుతుందని జనాలు బలంగా నమ్ముతుండటంతో దీనికి పాప్యులారిటీ వచ్చేసింది. కసరత్తులకు ముందు ఈ బుల్లెట్ కాఫీ తాగితే మంచిదని చెబుతుంటారు. ఈ మధ్య అనేక మంది సెలెబ్రిటీలు దీన్ని ఫాలో అవుతుండటంతో సామాన్యుల దృష్టి కూడ దీనిపై పడింది. అయితే, బుల్లెట్ కాఫీ కోసం సాధారణం ఉప్పులేని వెన్నను మాత్రమే వాడతారు. కీటోజెనిక్ ఆహార నియమాలు ఫాలో అయ్యే వాళ్లు ఈ బుల్లెట్ కాఫీ తాగుతుంటారు. దీని వల్ల తక్షణ శక్తి వస్తుందట.
Treamill Vs Outdoor Waking: ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
అయితే, ఈ కాఫీ విషయంలో డయాబెటిక్ రోగులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధి ఉన్న వారు దీన్ని తాగకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారానికి బదులు ఈ కాఫీ తాగితే మాత్రం డయాబెటిక్ రోగ్గుల్లో బరువు పెరగడం, చెడు కొలెస్టరాల్ స్థాయి పెరగడం, విటమిన్ లోపం వంటి సమస్యలు మొదలవుతాయి.
Glaucoma: ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు! కొత్త అధ్యయనంలో వెల్లడి
ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండవు. ఇందులో అత్యంత నాణ్యమైన గ్రాస్ ఫెడ్ బటర్ వాడినా కూడా ఇతర సాధారణ అల్పాహారాలతో పోలిస్తే పోషకాలు తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇష్టారీతిన ఈ కాఫీ తాగితే మాత్రం ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. భారతీయుల ఆహారంలో సహజంగానే కొవ్వులు, నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఆహారానికి బదులుగా బుల్లెట్ కాఫీపై ఆధారపడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందనేది నిపుణులు చెప్పే మాట. కాబట్టి, వైద్యుల సలహా మేరకు అవసరమనుకుంటే స్వల్పంగానే ఈ కాఫీ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Read Latest and Health News