BEL Trainee and Project Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
హైలైట్:
- బెల్ జాబ్ రిక్రూట్‌మెంట్ 2025
- 45 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
- మార్చి 12 దరఖాస్తులకు చివరితేది

మొత్తం ఖాళీల సంఖ్య: 45
- ట్రైనీ ఇంజినీర్-1: 42
- ప్రాజెక్టు ఇంజినీర్-1: 03
ఇతర ముఖ్యమైన సమాచారం :
- అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ (మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ Engineering)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 1.02.2025 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్టు ఇంజినీర్‌కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
- జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.30,000 – 35,000, ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు రూ.40,000 – 50,000.
- ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2025
మరో 20 సీనియర్ డిప్యూటీ ఇంజినీర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలిపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 సీనియర్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
మొత్తం పోస్టులు సంఖ్య: 20
- డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 08
- డిప్యూటీ ఇంజినీర్ (మెకానికల్): 12
ఇతర ముఖ్యమైన సమాచారం :
- అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: 01.02.2025 నాటికి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు.. ఒబీసీలకు 31 ఏళ్లు.. ఎస్సీ/ ఎస్టీ వారికి 33 ఏళ్లు ఉండాలి.
- జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ఫిజులో మినహాయింపు ఉంటుంది).
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2025