- అనుకోకుండా పాక్ సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ జవాన్..
- జవాన్‌ని అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ రేంజర్లు..
- విడుదల కోసం ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్..

BSF jawan: అంతర్జాతీయ సరిహద్దు (IB)ని అనుకోకుండా దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్‌ని పాకిస్తాన్ తన అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం రోజున జరిగింది. 182వ BSF బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్ అనుకోకుండా సరిహద్దు దాటాడు. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, సాధారణ కదలికల్లో భాగంగా, సింగ్ అనుకోకుండా సరిహద్దు కంచెను దాటి పాకిస్తాన్ వైపు ప్రవేశించాడు.
Read Also: Simla Agreement: ‘‘సిమ్లా ఒప్పందం’’ నిలిపేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్.. ఏంటీ ఒప్పందం..?
పాకిస్తాన్ రేంజర్లు ఫిరోజ్‌పూర్ సరిహద్దుల్లో సింగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సింగ్ బీఎస్ఎఫ్ యూనిఫాం, సర్వీస్ రైఫిల్‌తో ఉన్నాడు. నీడలో విశ్రాంతి తీసుకునేందుకు అతను రైతులతో పాటు వెళ్తుండగా పాకిస్తాన్ సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుం సైనికుడి విడుదలపై ఇరు పక్షాల అధికారులు ప్లాగ్ మీటింగ్ నిర్వహించారు. చర్చలు జరుగుతున్నాయి. అయితే, జవాన్‌ని ఇంకా భారత్‌కి పాక్ అప్పగించలేదు. సరిహద్దుల్లో దళాలు అనుకోకుండా ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లడం సాధారణం. ఫ్లాగ్ మీటింగ్ ద్వారా సమస్యని పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గామ్ దాడి జరిగిన తర్వాత, ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.