BRS MLC Kavitha Sensational Feedback On CM Revanth Reddy Govt

Written by RAJU

Published on:

  • హెచ్సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..
  • ఆ 400 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపిందే బీఆర్ఎస్..
  • హెచ్సీయూ భూముల్లో కంపెనీలు ఏర్పడితే వాతావరణంపై తీవ్ర ప్రభావం: ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha Sensational Feedback On CM Revanth Reddy Govt

MLC Kavitha: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హెచ్సీయూ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆ 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొనింది. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళ వద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం చేసింది అని గుర్తు చేసింది. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదు అని తెలిపారు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Read Also: HCU Tension: హెచ్సీయూ భూముల వేలంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు

అయితే, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు.. పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అంటూ మండిపడింది. కాగా, ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పడితే.. వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.

Subscribe for notification
Verified by MonsterInsights