– పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తండ్రి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: మాదాపూర్‌లోని ఖాన్‌మెట్‌లో భూవివాదం చోటు చేసుకుంది. మంగళవారం కొంతమంది తమ స్థలంలోకి వచ్చి కంచె వేసేందుకు ప్రయత్నించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) తండ్రి మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ ఖానామెట్‌లోని స్థల వివాదంపై పోలీసులకు రెండువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ స్థలంపై గత నెలలో ఫిర్యాదుదారుడు గంగిడి ఓం ప్రకాష్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Water board: నగరంలో.. ఒక క్యాన్.. ఒక మొబైల్ నంబర్ విధానం
20 ఏళ్ల కిత్రం తనతో పాటు మరో ముగ్గురు కలిసి సర్వే ఆఫ్ ఇండియా లేఔట్‌లో ఉన్న ప్లాటు నంబర్లు 495 నుంచి 504 వరకు ఉన్న వాటిని కొనుగోలు చేశామని, ఈ ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్లు 11/19, 11/20, 11/21 ఖానామెట్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ప్లాట్లల్లోకి సూర్యనారాయణ, జగన్ కుమార్, సుబ్బరాజు, శ్రీహరి రాజులు అక్రమంగా ప్రవేశించి స్థలం తమకు చెందినదని, దాని సర్వే నంబరు 11/37/ఎగా పేర్కొని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం కె.కొండలరావు (ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి) ఇదే స్థలం విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్(Madhapur Police Station)లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం మాదాపూర్(Madhapur) ఖానామెట్ విలేజ్ సర్వే నంబరు 11/37/ఎలో మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. దానికి తానే యజమాని అని చెప్పాడు. ఈ స్థలంలోకి ఓం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి, అతని అనుచరులు అక్రమంగా ప్రవేశించి స్థలం చుట్టూ కడీలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతుండగా, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించారు.
ఓంప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు వారిపై దాడి చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని కె.కొండల్‌రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదు చేశామని మాదాపూర్ పోలీసులు తెలిపారు. సర్వే నంబర్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో దీన్ని పరిశీలించాలని శేరిలింగంపల్లి ఎమ్మార్వోను కోరామని, సర్వే చేసిన తర్వాత వచ్చిన వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లంచాలు మరిగి.. వలకు దొరికి.. !
అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
Read Latest Telangana News and National News
Updated Date – Mar 12 , 2025 | 10:51 AM