ABN
, Publish Date – Mar 16 , 2025 | 08:42 AM
BRS Leaders Arrests: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో జనగామలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

BRS Leaders Arrests
జనగామ : జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇవాళ(ఆదివారం) సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు.
దీంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. సీఎం రేవంత్ టూర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. ఘన్‌పూర్‌లోని రాజయ్య ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో జనగామ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Updated Date – Mar 16 , 2025 | 08:48 AM