సృష్టిలో వంకాయ వంటి కూర లేదని భారతీయులు ఏనాడో చెప్పారు. చెప్పటం ఏంటి? తరతరాలనుంచి వంకార కూరను లొట్టలేసుకుని మరీ తింటున్నారు. వంకాయ తినటం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయని తేలింది. వంకాయలోని హై ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్దక సమస్య తీరుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి కూడా వంకాయ మంచి ఛాయిస్ అవుతుంది. ఇది బ్లడ్ షుగర్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. వంకాయలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంల కారణంగా ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరవు తగ్గటంలోనూ, మెదడును ఆరోగ్యంగా ఉంచటంలోనూ, కంటి చూపును, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచటంలోనూ వంకాయ ది బెస్ట్. అయితే, కొంతమందికి వంకాయ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోగాలతో బాధపడుతున్న వారు వంకాయను అస్సలు తినకూడదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వంకాయ తినకూడదు. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వాళ్లు వంకాయ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉంటే మంచిది. వీరితో పాటు వంకాయ తింటే అలర్జీలు వచ్చే వాళ్లు.. డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు.. రక్త హీనత ఉన్నవారు.. కళ్లలో ఏదైనా సమస్య ఉన్న వాళ్లు వంకాయ తినకూడదు. వీటిలో ఏ సమస్యా మీకు లేకపోతే ఎంచక్కా గుత్తి వంకాయ కూర చేయించుకుని తినవచ్చు.
హరప్పా కాలంలోనూ వంకాయ
వంకాయ చరిత్ర ఇప్పటిది కాదు.. కొన్ని వేల ఏళ్ల నుంచి భారతీయ వంటల్లో భాగంగా ఉంటోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికత అయిన హరప్పాలో కూడా వంకాయ వాడకం ఉండేదని తేలింది. పరిశోధనల్లో వంకాయ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. హరప్పా మట్టి పాత్రల అడుగుభాగాలను మైక్రోస్కోపులతో నిశితంగా పరిశీలించినపుడు మసాలాలు, దినుసుల గురించి తెలిసింది. వాళ్లు ఏం వంట వండారో తెలుసుకోవడానికి పరిశోధనలు మొదలయ్యాయి. చివరకు అది వంకాయ కూర అని తేలింది. వంకాయ పుట్టింది కూడా మన దేశంలోనే. తర్వాత ప్రపంచమంతా పాకింది. ప్రస్తుతం చైనా,జపాన్, యూరప్ దేశాల్లో దీన్ని బాగా పండిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Raw Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..
Magnesium Deficiency: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా.. ఈ పండ్లు