- ఉత్తరప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకలో కొట్లాట
- ఆచారాన్ని పాటించలేదని వరుడిని కొట్టిన వధువు బంధువులు
- పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాలు రాజీ

పెళ్లి అన్నాక అనేక ఆచారాలు, సంప్రదాయాలు, సరాదాలు, ఆటాపాటా.. ఇలా ఒక్కటేంటి? అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక నూతన దంపతుల్ని స్నేహితులు గానీ.. బంధువులు గానీ ఆట పట్టించే కార్యక్రమాలు.. ఇలా వగేరా ఉంటాయి. ఏదైనా కూడా హద్దుల్లో ఉంటే పర్వాలేదు.. శృతిమించితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొడతా: టిమ్ డేవిడ్
ఉత్తరాఖండ్‌కు చెందిన షబీర్ అనే యువకుడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత వివాహ ఆచారాల ప్రకారం నిర్వహించే చెప్పులు దాచడం అనే కార్యక్రమంలో భాగంగా వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచి పెట్టారు. తిరిగి ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వరుడు రూ.5 వేలు ఇచ్చాడు. అయితే వధువు బంధువులు అభ్యంతర చెబుతూ.. ‘బిచ్చగాడు’ అంటూ విమర్శించారు. అంతే వరుడి బంధువులకు కోపం వచ్చి ఎదురు తిరిగారు. దీంతో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. అనంతరం వరుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సర్ది చెప్పి పంపించేశారు.
ఇది కూడా చదవండి: US-India Tariffs: అమెరికాపై ప్రతీకార సుంకాలపై భారత్ కీలక ప్రకటన