2025-03-26T08:50:48+05:30
లారీ ఢీకొని భార్యభర్త మృతి..
-
అల్లూరి జిల్లా: పాడేరు- అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం
-
హుకుంపేట మండలం కోట్నాపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ
-
లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు
2025-03-26T08:36:12+05:30
ఘోర రోడ్డుప్రమాదం..
-
హైదరాబాద్: మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం
-
ప్రమాదవశాత్తూ కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
-
ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి
2025-03-26T08:28:01+05:30
ఏటీఎం చోరీ నిందితులు అరెస్టు..
-
రంగారెడ్డి: మహేశ్వరం పరిధి రావిర్యాల ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
-
ఇద్దరు నిందితులు హర్యానా రాష్ట్రం మేవాత్‌కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు
-
ఈనెల 3న రావిర్యాలలోని ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.13 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితులు
-
నిందితులు ముంబై వైపునకు వెళ్తూ మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీకి యత్నం
-
షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, అక్కడ్నుంచి పారిపోయిన దొంగలు
-
నిందితుల కోసం మేవత్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలు, స్థానికుల సహాయంతో అరెస్టు
-
నిందితుల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన యంత్రం, ఇతర సామగ్రి స్వాధీనం