BP: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. ఇలా తగ్గించుకోండి..

Written by RAJU

Published on:

ఈ మధ్య కాలంలో చాలా మంది హైబీపితో బాధపడుతున్నారు. భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంటుంది. అయితే, ఈ సమస్యను చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. కానీ, ఈ సమస్య అనేక రోగాలను తెచ్చిపెడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, వైకల్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే, అసలు అధిక రక్తపోటుకు కారణమేమిటి? బీపీ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక రక్తపోటుకు కారణమేమిటి?:

మద్యం, ధూమపానం, ఒత్తిడి, ఊబకాయం వంటివి అధిక రక్తపోటుకు కారణం. వ్యాయామం చేయకపోయినా కూడా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

బీపీ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి?:

బీపీ అదుపులో ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి.

BPని నివారించడం ఎలా?:

ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, మీరు బరువుగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి, వంటల్లో ఉప్పును 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు, మద్యపానం తాగే అలవాటు ఉంటే మానేయడం మంచిది, అలాగే రోజూ 30 నిమిషాల వ్యాయామం చేస్తే బీపీ 5 నుంచి 8 పాయింట్లు తగ్గుతుంది.

ఈ ఆసనాలు చేయవద్దు:

BP ఎక్కువగా ఉన్నప్పుడు శీర్షాసనం, సర్వంగాసనం, దండన కూర్చోవడం, శక్తి యోగా వంటి ఆసనాలు చేయడం మంచిది కాదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Subscribe for notification
Verified by MonsterInsights