– రంగంలోకి కేంద్ర మంత్రులు
– కార్పొరేటర్లు, ముఖ్యనాయకులకు దిశా నిర్దేశం
– ఎంఐఎంకు వ్యతిరేకంగా వెలిసిన బ్యానర్లు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ స్థానిక ఎన్నికలను బీజేపీ(BJP) సవాల్‌గా తీసుకుంది. ఈ ఎన్నికలో మజ్లిస్, బీజేపీ మాత్రమే తలపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. ఎంఐఎంతో పోటీ నేపథ్యంలో బీజేపీ మంత్రులు, అగ్రనాయకులు తమ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) కార్పొరేటర్లతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: మరో 16 ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
అంతకుముందు హరిత ప్లాజా హోటల్‌లో మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గౌతం రావు కూడా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందూ వ్యతిరేక పార్టీగా ఎంఐఎంను ప్రచారం చేస్తున్నారు. అలాంటి పార్టీకి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నాయని ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేసే కార్పొరేటర్లను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటామని బండి సంజయ్ హామీనిస్తున్నారు.
ఎంఐఎంకు వ్యతిరేకంగా బ్యానర్లు
హైదరాబాద్ స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మజ్లి్‌సకు వ్యతిరేకంగా పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. సికింద్రాబాద్ మల్కాజిగిరి బీజేపీ జిల్లా పరిధిలోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో ఈ బ్యానర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘గౌరవనీయులైన కార్పొరేటర్ గారికి మనవి. హిందూ దేవుళ్లను కించపరుస్తున్న ఎంఐఎంకు ఓటు వేయవద్దు. మీరు తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలి. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటువేయాలి’ అని బ్యానర్లలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
నీట ఆటగాడు..
Read Latest Telangana News and National News