– రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కిలో మాత్రమే
– మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్
హైదరాబాద్: ఉగాది నుంచి సన్నబియ్యం అందిస్తామని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చేది కేవలం ఒక్క కిలో మాత్రమేనని మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్(Kodicherla Mahender) అన్నారు. బుధవారం బీజేపీ(BJP) నాయకులు మూసాపేట డివిజన్‌లోని రేషన్‌దుకాణాల వద్దకు రేషన్ బియ్యం అందిస్తున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనని కరోనా కాలం నుంచి నేటి వరకు కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రేషన్ దుకాణాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రేషన్ దుకాణల వద్ద స్లిప్‌లపై ఏమి రాసి ఉందో లబ్ధిదారులకు చదివి వినిపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పుల్లయ్య వచ్చాడట పదండి..
హెచ్‌సీయూ భూములు కాపాడుకుందాం
హైదరాబాద్ సెంట్రల్ యూనవర్సిటీ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కార్పొరేటర్ మహేందర్ అన్నారు. పశుపక్షాదులు, ఎన్నోజీవరాశులకు ఉన్న హెచ్‌సీయూలో రాత్రికి రాత్రే బుల్డోజర్‌లు పెట్టి చెట్లను తొలగించడం దారుణమని మండిపడ్డారు. హిందూ పండుగలకు పర్యావరణంతో ముప్పు అంటూ చెప్పే సెక్యులర్‌లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
హెసీయూ భూములు అమ్ముకుంటే పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నారు. వీలైతే మొక్కలు నాటాలని కాంగ్రెస్ పాలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు ఎర్రాస్వామి, రవిగౌడ్, శ్రీనివాస్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్, ఎలేందర్, శోభరాజన్, జానకి, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శాంతికి మేం సిద్ధం!
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
Sangareddy: రాతి గుండె తల్లి
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News
Updated Date – Apr 03 , 2025 | 10:28 AM