- బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఘటన
- కార్ డ్రైవర్, ఖాజా ఇద్దరు మధ్య వాగ్వాదం
- వారిని సముదాయించే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
READ MORE: Bollywood : బాలీవుడ్ స్టార్స్.. బాక్సాఫీస్ వార్
అయితే, ఈ క్రమంలో ఖాజా పక్కనే ఉన్న బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించగా, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఖాజాపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్లో రోడ్డు రేసింగ్, వేగంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
READ MORE: Delimitation Effect: ఎమర్జెన్సీగా ఢిల్లీ టూర్‌కు పళినిస్వామి.. బీజేపీ అగ్ర నేతలను కలిసే అవకాశం