కుప్పం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు పూర్తిగా మోసపోయారని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ స్మారక ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి విమర్శించారు. దేవుడి దయవల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్నో పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లెలో మల్బరీ తోటలను ఆమె సందర్శించారు. పట్టు పురుగుల షెడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకుప్పం మండలం కొంగనపల్లె, రాజుపేట గ్రామాలను సందర్శించి మహిళలతో సమావేశమయ్యారు. అంతకుముందు శాంతిపురం మండలం కడపల్లె వద్ద నిర్మాణంలో ఉన్న సొంత ఇంటి పనులను పరిశీలించి సూచనలు చేశారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ… తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..