Bhatti Vikramarka: ‘పునర్విభజన’పై అన్ని పార్టీలతో చర్చిద్దాం

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 16 , 2025 | 04:53 AM

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీలతో చర్చిద్దామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై చర్చించే వేదిక, సమయాన్ని ఖరారు చేయడానికి శనివారం ఆయన మాజీ మంత్రి కే జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు.

Bhatti Vikramarka: ‘పునర్విభజన’పై అన్ని పార్టీలతో చర్చిద్దాం

  • జానారెడ్డితో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

  • త్వరలో వేదిక, సమయం ఖరారు

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీలతో చర్చిద్దామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై చర్చించే వేదిక, సమయాన్ని ఖరారు చేయడానికి శనివారం ఆయన మాజీ మంత్రి కే జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఇరువురు కొంత సేపు చర్చించుకున్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహణకు సచివాలయం లేదా పూలే ప్రజా భవన్‌లో ఏదో ఒకదానిని ఖరారు చేయాలన్న యోచనకు వచ్చారు. పునర్విభజనపై అఖిలపక్షంతో చర్చించే బాధ్యతలను భట్టివిక్రమార్క, జానారెడ్డిలకు సీఎం రే

వంత్‌రెడ్డి అప్పగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులతో చర్చించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అన్ని పార్టీల నాయకులతో శనివారమే ఫోన్‌లో మాట్లాడారు. వేదిక, సమయంపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వీటిని త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు.

Updated Date – Mar 16 , 2025 | 04:53 AM

Google News

Subscribe for notification