Betting Apps: బెట్టింగ్‌ కేసులు.. సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌

Written by RAJU

Published on:

ఐజీ రమేశ్‌ సహా ఐదుగురి నియామకం

నేడు డీజీపీ కార్యాలయంలో సిట్‌ భేటీ

3 నెలల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్స్‌పై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌ పనిచేసేలా డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ (పీ అండ్‌ ఎల్‌) ఎం.రమేశ్‌ నేతృత్వంలోని సిట్‌లో.. ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్‌ సభ్యులుగా ఉంటారు. సిట్‌ భవిష్యత్‌ అవసరాల మేరకు ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ), న్యాయ, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఇతర విభాగాల నుంచి సహాయసహకారాలు పొందేలా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులను సిట్‌ విచారించనుంది. దీంతోపాటు.. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం, బెట్టింగ్‌ యాప్‌లను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి, పలు సూచనలతో ప్రభుత్వానికి మూడు నెలల్లో సమగ్ర నివేదికను అందజేయనుంది. సిట్‌ బృందం మంగళవారం డీజీపీ కార్యాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు పంజాగుట్ట, మియాపూర్‌ పోలీ్‌సస్టేషన్లతోపాటు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్‌ యాప్‌లపై నమోదైన కేసులను ఈ సందర్భంగా విశ్లేషించనుంది.

ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date – Apr 01 , 2025 | 06:13 AM

Subscribe for notification
Verified by MonsterInsights