బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై తెలంగాణ పోలీసుల బాటలోనే నడుస్తున్నారు బెంగళూరు పోలీసులు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్నాటక పోలీసులు.. ఏకంగా వందమంది రీల్స్ స్టార్లకు నోటీసులిచ్చారు. వారిలో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు వారంతా అంగీకరించినట్టు చెబుతున్నారు పోలీసులు. మరోసారి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయబోమని ఈ ఒక్కసారికి క్షమించాలని కోరుతూ పోలీసులకు లేఖలు అందించారు పలువురు యూట్యూబ్ స్టార్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు. మరోవైపు ఈ వ్యవహారంలో నిందితులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు బెంగళూరు సీసీఎస్ పోలీసులు.
యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు..యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్చేయిస్తున్నారు. దీని కోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. వారు ప్రమోట్ చేసిన వీడియోలను పలు సోషల్‌మీడియా యాప్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. సెలబ్రెటీలకు లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్ఉండడంతో బెట్టింగ్యాప్స్వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. అయితే బెట్టింగ్‌లకు బానిసై ఆర్థికంగా నష్టపోయి యువత ప్రాణాలు తీసుకుంటుండడంతో..ఆ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నోళ్లపై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. అందులో భాగంగా యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై కేసులు పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి