- ఈనెల 26న గౌహతిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ సమావేశం
- రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా ఖరారు..
- భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు సమావేశం
- పాల్గొననున్న కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రాబోయే సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ఖరారు చేయడానికి.. భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు కీలకమైన సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొననున్నారు. ఈ సమావేశం మార్చి 29న (శనివారం) గౌహతిలో జరుగనుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఇతర సంబంధిత వర్గాలు భారత క్రికెట్ భవిష్యత్తు కోసం కొన్ని కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు.
Read Also: KTR : ఆయనకు ఫ్రస్టేషన్ తగ్గట్లేదు.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్ సంచలనం
స్టార్ ఆటగాళ్లకు A+ కాంట్రాక్టులు కొనసాగింపు
టీమిండియా స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా తమ A+ కాంట్రాక్టులను కొనసాగిస్తారని వర్గాలు తెలిపాయి. వీరితో పాటు.. గత సంవత్సరం దేశీయ క్రికెట్‌కు దూరమైన కారణంగా కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్‌తో సహా మరికొన్ని కొత్త పేర్లు జాబితాలో చేర్చనున్నారు. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మలు మొదటిసారిగా కేంద్ర కాంట్రాక్ట్ జాబితాలో చేరే అవకాశం ఉంది. గతసారి.. కేంద్ర కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించారు. మరోవైపు.. శుభ్‌మన్ గిల్ ‘ఏ గ్రేడ్’ నుంచి ‘ఏ గ్రేడ్+’కు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే.. అక్షర్ పటేల్ ‘గ్రేడ్ బి’ నుంచి ‘గ్రేడ్ ఏ’కు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో హీరోగా నిలిచిన బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈసారి సెంట్రల్ కాంట్రాక్టును పొందనున్నాడు. మరోవైపు.. ఈ సమావేశంలో టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు గురించి కూడా చర్చలు జరగనున్నాయి. బోర్డు ఈ సమావేశంలో టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Pushpa2TheRule : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..
భవిష్యత్ టెస్ట్ కెప్టెన్సీపై చర్చలు
భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌గా ఎవరు నియమించబడతారనే దానిపై కూడా బోర్డు చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారత క్రికెట్ జట్టులో అగ్ర నాయకత్వ బాధ్యతలను చేపట్టేందుకు అనేక పేర్లు భావిస్తున్నాయి. అందువల్ల.. ఈ సమావేశం భారత క్రికెట్ జట్టుకు కొత్త మార్గదర్శకాలను అవలంబించడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం బీసీసీఐ చేస్తున్న ఈ ప్రయత్నం.. ఆటగాళ్లందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వడానికి.. క్రికెట్‌లో దేశానికి గొప్ప విజయాలు సాధించడానికి దారితీస్తుంది.