- ఎప్పటిలాగే అత్యుత్తమ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్న ఐపీఎల్ 2025.
- మర్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్.
- 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ.
- బీసీసీఐ భారీగా ఏర్పాట్లు.

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 అణాగ్రంగా వైభవంగా మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ లీగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఒక్క కోల్‌కతాలోనే కాదు, మొత్తం 13 వేదికల్లోనూ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనుంది.
Read Also: IPL 2025: ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఈ ఏడాది BCCI ప్రత్యేకంగా ప్రతి వేదికపై తొలి మ్యాచ్‌కు ముందుగా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, గాయకులు, ఇతర ప్రముఖ కళాకారులు పాల్గొని అభిమానులను అలరించనున్నారు. సాధారణంగా, ఓపెనింగ్ మ్యాచ్‌కు మాత్రమే గ్రాండ్ సెర్మనీ జరుగుతుంది. కానీ, ఈసారి 13 వేదికల్లోని ప్రతి స్టేడియంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి.
మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో 30 నిమిషాల పాటు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్, ప్రముఖ నటి దిశా పటాని స్టేజ్‌పై సందడి చేయనున్నారు. ఈ వేడుకకు ఐసీసీ చైర్మన్ జై షా కూడా హాజరవుతున్నారు. కోల్‌కతాతో పాటు, మిగిలిన 12 వేదికల్లోనూ ఇలాంటి ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. బీసీసీఐ దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లోని అభిమానులను ఆకర్షించేందుకు స్థానిక, జాతీయ కళాకారులను పర్ఫార్మెన్స్‌కు ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్రతి వేదిక కోసం ప్రత్యేకంగా బాలీవుడ్, ప్రాంతీయ కళాకారులను ఎంపిక చేయనున్నారు. మార్చి 19నాటికి అన్ని ప్రదర్శనలు ఖరారు అవుతుంది.
Read Also: Realme P3: పవర్‌ఫుల్ ఫీచర్లతో కొత్త మొబైల్స్ను లాంచ్ చేసిన రియల్‌మీ
ఈసారి తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించబోతున్నారు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నా.. బీసీసీఐ, స్టేట్ అసోసియేషన్లు కలిసి సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం మీద.. ఐపీఎల్ 2025 ఎప్పటిలాగే అత్యుత్తమ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ తీసుకున్న ప్రత్యేక నిర్ణయంతో ప్రతి వేదికపై ప్రత్యేక సంబరాలు, అభిమానులకు మరింత వినోదాన్ని అందించబోతున్నాయి.