దేశ దిశ

BCCI huge shock for Rishabh Pant

BCCI huge shock for Rishabh Pant


  • రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాక్
  • ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు 24 లక్షల జ‌రిమానా
BCCI huge shock for Rishabh Pant

లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాకిచ్చింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు 24 లక్షల జ‌రిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్ తో పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6 లక్షలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిటిలో ఏది త‌క్కువ అయితే అది ఫైన్‌గా విధిస్తారు. కాగా ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయితే 90 లక్షల ఫైన్ తో పాటు డీమెరిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి.

Also Read:Paddy Procurement : నిజామాబాద్‌లో ధాన్యం దిబ్బలు.. రైతుల కన్నీళ్లు.. లారీల మాయాజాలంలో అన్నదాత అగచాట్లు..!

ఈ డీమెరిట్స్ పాయింట్స్ లెక్క దాటితే పంత్ ఒక మ్యాచ్ కి సస్పెండ్ అవుతాడు. ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దిష్ట సమయానికి మ్యాచ్ కంప్లీట్ చేయకపోతే బీసీసీఐ ఆ జట్టు కెప్టెన్ కు 12 లక్షలు ఫైన్ విదిస్తుంది. అదే తప్పు మళ్ళీ రిపీట్ అయితే జట్టు కెప్టెన్ 24 లక్షలు కట్టాల్సి ఉంటుంది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ నమోదైంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

Also Read:CM Revanth Reddy : కేసీఆర్‌కు నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది

ముంబై తరఫున ర్యాన్ రికెల్టన్ 58 పరుగులతో సత్తా చాటాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో ఎల్ఎస్ జీ బౌలర్లను ఉతికారేశాడు. దానికి తోడు సూర్యకుమార్ యాదవ్ 54 పరుగులతో రాణించడంతో ముంబై విజయం సులువైంది. ఇక ముంబై ఇచ్చిన భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం దక్కలేదు. ఐడెన్ మార్క్రమ్ 9 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని ఫర్వాలేదనిపించినా మిగతా ప్లేయర్ల సపోర్ట్ లేకపోవడంతో లక్నో 161 పరుగులకే పరిమితమైంది. ఈ సీజన్లో ముంబైకిది ఆరో విజయం కాగా లక్నోకిది ఐదో ఓటమి.

Exit mobile version