Bank Deposit: ఈ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకు ఏవో తెలుసా..? – Telugu News | Fixed Deposit: SBI to HDFC Bank – 6 banks offering attractive FD interest rates

Written by RAJU

Published on:

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలు భారతదేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) పథకాలు అనేవి బ్యాంకులో నిర్దిష్ట కాలానికి ఏకమొత్తం పెట్టుబడులు. ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో డిపాజిటర్ ఖాతా తెరిచే సమయంలో నిర్ణయించిన స్థిర రేటుకు వడ్డీని పొందుతారు. లబ్ధిదారులకు వారి ప్రాధాన్యత ప్రకారం.. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా సంపాదించే వడ్డీని పొందే అవకాశం అందిస్తుంది. టర్మ్ డిపాజిట్‌లను ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని కూడా అంటారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు స్టాక్ మార్కెట్‌కు సంబంధించినవి కావు. అలాగే స్థిర వడ్డీ రేటును సంపాదించాలనుకునే, ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి ఇవి బాగా సరిపోతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే రాబడికి హామీ ఇస్తుంది. అలాగే మూలధన నష్టానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పొదుపు ఖాతాలతో పోలిస్తే ఎఫ్‌డీలు మెరుగైన వడ్డీ రేటును అందిస్తాయి. అనేక బ్యాంకులు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలను అందిస్తాయి. ఇవి పన్నులను ఆదా చేయడంలో ప్రజలకు సహాయపడతాయి. ఎఫ్‌డీ ఖాతా తెరిచినప్పుడు డిపాజిటర్లు ముందుగా నిర్ణయించిన కాలానికి నిర్దిష్ట మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలి. డిపాజిట్ మెచ్యూరిటీ వరకు డిపాజిట్ చేసిన డబ్బును ఉపసంహరించుకోకుండా ఖాతాదారులు నిర్ధారించుకోవాలి. పెట్టుబడిదారుడి ప్రాధాన్యతను బట్టి 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు అనేక పెట్టుబడి కాలాలను రుణదాతలు అందిస్తారు.

  1. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన ఐదేళ్ల ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ పౌరులకు 6.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందిస్తోంది.
  2. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ అందించే ఎఫ్‌డీ ప్లాన్‌లు, ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7 శాతం రాబడిని, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం రాబడిని నిర్ధారిస్తాయి.
  3. ఐసీఐసీఐ బ్యాంక్ ఐదేళ్ల ఎఫ్‌డీ పథకానికి తన రెగ్యులర్ కస్టమర్లకు 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.
  4. ఫెడరల్ బ్యాంక్ కూడా కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్ ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది.
  5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 6.8 శాతం, 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
  6. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ ప్రభుత్వ బ్యాంకు తన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల FD పథకంపై వరుసగా 6.8 శాతం, 7.4 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification