ఉద్యోగం, ఇతర పనుల నిమిత్తం రోజంతా ఇంటి బయట గడిపేవారు ఇష్టం లేకపోయినా ఫాస్ట్ ఫుడ్ తినక తప్పదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఎన్ని మందులు తీసుకున్నా ఒక్కోసారి కడుపునొప్పి మళ్ళీ మళ్లీ వస్తూనే ఉంటుంది.
అందుకే బయటి ఆహారాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇదే ఏకైక మార్గం. కానీ అది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. బదులుగా ఇంట్లో మీ వంట శైలిని కాస్త మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.
వెల్లుల్లి, అల్లం, మిరియాలు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో అద్భుతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కాబట్టి ఇంట్లో వంటలు చేసేటప్పుడు వెల్లుల్లి, అల్లం, మిరపకాయలను జోడించడం మర్చిపోకూడదు. వంటల రుచి కూడా బాగుంటుంది. పైగా ఆరోగ్యం కూడా ఎన్నోరెట్లు మెరుగుపడుతుంది.
మిరియాలు, వెల్లుల్లి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఈ మూడు వస్తువులను మీ వంటలో చేర్చుకోవడం వల్ల గ్యాస్ట్రిటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.