ABN
, Publish Date – Mar 28 , 2025 | 05:30 AM
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కేంద్ర మంత్రులను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు

కేంద్ర మంత్రులకు మంత్రి కొండపల్లి వినతి
న్యూఢిల్లీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఏపీలోని భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడిని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. గురువారం ఆయన పార్లమెంటులోని మంత్రి కార్యాలయంలో కలిశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్థికి మరింత ఊతం లభిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితిన్ రామ్ మాంజీని కోరారు. అంతకుముందు గ్రామీణాభివృద్థి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి, స్ర్తీనిధి బ్యాంక్ ద్వారా అందించే రుణాలపై వడ్డీ రాయితీని కల్పించాలని కోరారు. తన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
Updated Date – Mar 28 , 2025 | 05:30 AM