Avanigadda Accident : కృష్ణా జిల్లా అవనిగడ్డ పులిగడ్డ – పెనుమూడి వారధి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన ముగ్గురు వ్యక్తులు గిడుగు రవి మోహన్ బాబు, అతని భార్య అరుణ, మనవడు షణ్ముఖ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.