Avakaya Pickle Recipe: అమ్మమ్మకాలం నాటి కోనసీమ స్టైల్‌లో ఆవకాయ.. పక్కా కొలతలతో ఇలా.. తింటే ముద్దముద్దకి మజా…

Written by RAJU

Published on:

Avakaya Pickle Recipe: అమ్మమ్మకాలం నాటి కోనసీమ స్టైల్‌లో ఆవకాయ.. పక్కా కొలతలతో ఇలా.. తింటే ముద్దముద్దకి మజా…

ఎండాకాలం వచ్చిందంటే చాలు తెలుగు వారి లోగిళ్ళు పచళ్ళ తయారీతో సందడిగా ఉండేది. పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు ఆవకాయ, మాగాయ, టమాటా, నిమ్మ, దబ్బ, అల్లం వంటి రకరకాల ఊరగాయాను తయారు చేసి ఉంచేవారు. ఈ ఊరగాయలు ఏడాది పాటు నిల్వ ఉండేవి. అయితే కాలం మారింది. దీంతో మనుషుల అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చడి అంటే ఇష్టం ఉన్నా.. ఎందుకు శ్రమ అంటూ ఇంట్లో తయారు చేసుకోవడం మానేసి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుని తింటున్నారు. ఇవి అంతగా రుచిగా ఉండవు.. పైగా నూనె కూడా తక్కువ ధర నూనె ఉపగిస్తారు. ధర కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కనుక మీరు కూడా అమ్మమ్మ కాలం నాటి విధంగా పచ్చళ్ళు పెట్టుకోవాలని భావిస్తున్నారా.. ఈ రోజు కోనసీమ స్పెషల్ ఆవకాయ తయారీ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  1. మామిడికాయ(సువర్ణ రేఖ లేక తెల్ల గులాబీ) ముక్కలు: 1 సేరు
  2. ఆవపిండి: 150 గ్రాములు
  3. మెంతులు: 25 గ్రాములు
  4. కొత్త కారం: 150 గ్రాములు
  5. పసుపు – 2 టీ స్పూన్లు
  6. ఉప్పు: రుచికి సరిపడా
  7. నువ్వుల నూనె: అర్ధ కిలో
  8. వెల్లుల్లి : 30 రెమ్మలు

తయారీ విధానం: ముందుగా మామిడికాయలను శుభ్రం చేసుకుని నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి. మామిడి కాయల మీద నీరు ఆరిపోయిన తర్వాత కాయలను కాటన్ గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు మామిడి కాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు పగల కుండా చూసుకుకోవాలి. మామిడి ముక్కల్లో జీడి, పోర లేకుండా శుభం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం లేదా ఒక గిన్నె తీసుకుని అందులో కారం, ఆవ పిండి, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి, పసుపు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఆవ మిశ్రమంలో శుభ్రం చేసుకున్న మామిడి ముక్కలు వేసి కొంచెం కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. తర్వాత తీసుకున్న నూనె వేసుకుని మరోసారి ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు కలిసేలా కలుపుకోవాలి.

ఇప్పడు తడి లేని ఒక జాడీని లేదా గాజు సీసా తీసుకుని అందులో ముందుగా కొంచెం నూనె వేసి.. తర్వాత మామిడి ముక్కలు వేసుకున్న ఆవ మిశ్రమాన్ని.. పొరలు పొరలుగా వేసుకోవాలి. మొత్తం మిశ్రమం మొత్తం జాడీలో వేసుకుంటూ పోయాలి. ఇప్పుడు మిగిలిన నూనెను జాడీలో పోసుకోవాలి. అంటే జాడీలోని పచ్చడిపైన ముక్కలకు కనీసం అంగుళం పైన నూనె తేలేలా పోసుకోవాలి. తర్వాత జాడీకి మూత పెట్టి జాడీ మూతిని గుడ్డని చుట్టి గట్టిగా కట్టేయాలి. మూడు రోజుల పాటు దీనిని అలా ఉంచుకోవాలి.

మూడో రోజు జాడీ మూత తీసి ఉప్పు చూసుకుని తక్కువైతే వేసుకుని నూనె కొంచెం పోసి.. ఎండలో కొంచెం సేపు పెట్టి.. తర్వాత జాడీ పైన మూత పెట్టి జాగ్రత్త చేయాలి. ఈ ఆవకాయ పచ్చడి ఎటువంటి తడి తలగకుండా ఉంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అంటూ మై మరచి ముద్ద ముద్దని ఎంతో ఇష్టంగా తింటారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights