ముంబై: ఆటిజంతో సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నపిల్లల తల్లితండ్రుల కోసం హక్కుల కార్యకర్త ముగ్ధ కల్రా ఓ ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించారు. ఏప్రిల్ నెలను ఆటిజం గురించి అవగాహన, స్వీకరణ నెలగా జరుపుతుండగా.. సమగ్ర విధానాలు.. తొలి దశలో జోక్యం..సంరక్షకుల ఆనందం వంటి అంశాలపై అందరూ చర్చిస్తున్నారు.
1970లో అమెరికా ఆటిజం సంఘం ఆరంభించిన ఈ కార్యక్రమం..ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో ఏప్రిల్ 2ను ప్రపంచ ఆటిజం అవగాహన దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నారు. “వైవిధ్యాన్ని ఆనందంగా స్వీకరించండి” అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ఆటిజం డేను నిర్వహిస్తున్నారు.
ఇది ఇళ్లలో, విద్యాలయాల్లో, పని కార్యాలయాల్లో, సమాజాల్లో న్యూరో వైవిధ్యాన్ని ఆదరించడాన్ని, సమగ్ర వాతావరణాన్ని సృష్టించడాన్ని ప్రేరేపిస్తుంది. ఆటిజం రోజుని ఉద్దేశించి.. ముగ్ధ కల్రా “ఐ సీ యు, ఐ గెట్ యు: ది సెల్ఫ్-కేర్ గైడ్ ఫర్ స్పెషల్ నీడ్స్ పేరెంట్స్” అనే పుస్తకాన్ని రచించారు. దీన్ని బుకోస్మియా సంస్థ ఆవిష్కరించింది.
బెంగళూరులో జరిగిన ఇండియా ఇంక్లూజన్ సమ్మిట్, ఇండియన్ న్యూరో డైవర్సిటీ సమ్మిట్ సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లితండ్రులు ఎదుర్కొనే భావోద్వేగ, ఆర్థిక, సామాజిక సమస్యలను విశ్లేషిస్తుంది.
ప్రత్యేకించి భారతదేశంలో వ్యవస్థాగత సహకారం తగినంతగా లేని పరిస్థితిని ముగ్ధ సూచిస్తూ తన అనుభవాలను ఇందులో పొందుపరిచారు. ఆచరణీయ పద్ధతులు,జ్ఞానాన్ని అందిస్తూ, సంరక్షకులు తమ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వాలనే అంశాన్ని ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు. “కార్పొరేట్ సంస్థలు వారి సంరక్షకులను ఉద్యోగంలోకి తీసుకుంటే, వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయని” ముగ్ధ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Malreddy Ranga Reddy: అందుకోసం రాజీనామా చేస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ
KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన
Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ
BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..
CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్ నివాళి
Read Latest Telangana News and Telugu News