Australian player Mitchell Starc praises KL Rahul as ‘Mr. Fixit’

Written by RAJU

Published on:


  • టీమిండియాపై ప్రశంసలు గుప్పించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్
  • ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దించగల ఏకైక దేశంగా భారత్ అని వ్యాఖ్యలు.
  • కెఎల్ రాహుల్‌ను ‘మిస్టర్ ఫిక్సిట్’గా ప్రశంసించిన స్టార్క్.
Australian player Mitchell Starc praises KL Rahul as ‘Mr. Fixit’

KL Rahul: మార్చి 9న టీమిండియా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు మరో పది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మొదలు కాబోతుంది. దీనితో మరో దాదాపు 50 రోజులపాటు క్రికెట్ అభిమానులకు సందడి షురూ కానుంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగా.. ఈ రోజు (గురువారం) ఉదయం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగా ఆయన భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Stuart MacGill: మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ప్రస్తుతం వైట్-బాల్ క్రికెట్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుందని చెప్పుకొచ్చాడు. గత రెండు ఐసీసీ ఈవెంట్‌లను గెలుచుకొవడం ఇందుకు నిదర్శనమని కొనియాడాడు. 2024 టి20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ఫార్మాట్లలో ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దించగల ఏకైక దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

Read Also: Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ సురక్షితంగా లేదు’’.. G7కి కెనడా వార్నింగ్..

ఈ స్టార్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తన కొత్త ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహచర ఆటగాడు KL రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలంలో క్యాపిటల్స్ స్టార్క్‌ను రూ. 11.75 కోట్లకు కొనుగోలు చేయగా, KL రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ.. KL రాహుల్ టీమ్ ఇండియాకు మిస్టర్ ఫిక్సిట్ లాంటి వ్యక్తని, అవసరమైనప్పుడు ఓపెనర్‌గా అలాగే మరికొన్ని సార్లు ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా ఆడుతాడని ప్రసంశించాడు. ఇప్పుడు అతనితో కలిసి ఆడేందుకు నేను ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.

Subscribe for notification