- ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభాన్ని అందించిన అశుతోష్
- అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అశుతోష్ శర్మ
- లక్నోతో మ్యాచ్‌లో పవర్ హిట్టింగ్.

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లియర్ మైండ్‌సెట్‌తో మైదానంలో అడుగుపెట్టి.. పవర్ హిట్టింగ్ చేశాడు. మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 66 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు. వైజాగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశుతోష్ చివరి వరకూ పోరాడాడు. విజయానికి చివరి ఓవర్లో 6 పరుగులు కావాల్సి ఉండగా.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. ఇంకా మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించాడు.
Read Also: Salman Khan : సౌత్ ఇండియా ప్రేక్షకులు మా సినిమాలు చూడట్లేదుః సల్మాన్ ఖాన్
ఈ సందర్భంగా తన ప్రదర్శనపై అశుతోష్ మాట్లాడుతూ.. “నేను క్రికెట్‌ను ఎంతగానో ఆస్వాదిస్తాను. బ్యాటింగ్ చేస్తే ఆడినట్టు అనిపిస్తుంది. ప్రత్యేకంగా స్పిన్నర్లకు ఎదురుగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నేను ప్రతీ డెలివరీని హిట్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే మ్యాచ్‌లో అటువంటి పరిస్థితి వస్తే నేను దాన్ని సమర్థంగా ఎదుర్కొనగలను” అని పేర్కొన్నాడు. మరోవైపు.. డీసీ మెంటర్ కెవిన్ పీటర్సన్‌తో తన అనుభవాన్ని అశుతోష్ పంచుకున్నాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత పీటర్సన్‌ను హగ్ చేసుకున్న అశుతోష్.. వారి మధ్య ఉన్న స్నేహాన్ని హైలైట్ చేశాడు. “మా మెంటర్ పీటర్సన్ మాతో వారి అనుభవాలను పంచుకోవడం గొప్ప అనుభూతి. నెట్ సెషన్‌లో వారు ఇచ్చే సూచనలు చాలా ఉపయోగపడతాయి. వారి ఆలోచనలను చర్చించడం, ప్రశ్నలు అడగడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది” అని అశుతోష్ పేర్కొన్నాడు.
Read Also: David Warner: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే!
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 30 (ఆదివారం) విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ టీమ్‌ను ఢిల్లీ ఎలా ఎదుర్కొంటుందనేది అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.