- అక్షయ తృతీయ వేళ కనికరించిన పసిడి ధరలు
- బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి
- నేడు తులం బంగారం పై రూ. 60 తగ్గింది

అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు నేటి ధరలు ఊరట కలిగించాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనాలనుకునే వారికి ఉపశమనం అనే చెప్పాలి. నేడు తులం బంగారం పై రూ. 60 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,791, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,975 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గడంతో రూ. 89,750 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60 తగ్గడంతో రూ. 97,910 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 98,040 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Chandrababu: సింహాచలం ఘటనపై చంద్రబాబు విచారం.. మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖంపట్టాయి. నేడు సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 500 తగ్గి రూ. 1,00,000 వద్ద అమ్ముడవుతోంది.