ABN
, Publish Date – Apr 11 , 2025 | 11:34 PM
Digital Feedback System
అరసవల్లిలో ఆదిత్యుడ్ని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో సరైన సేవలు అందక కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.

ఆదిత్యాలయంలో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ స్కానర్
భక్తుల సలహాలు, సమస్యలు నేరుగా సీఎం పేషీకి
అరసవల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఆదిత్యుడ్ని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో సరైన సేవలు అందక కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ఆలయం బయట ఫీడ్‌బ్యాక్ స్కానర్ ఏర్పాటు చేశారు. ఆదిత్యుడి ఆలయంలో సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనా దీనిద్వారా భక్తులు చెప్పుకోవచ్చు. ఆలయ కార్యక్రమాలకు సంబంధించి, సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వవచ్చు. భక్తులు ఫోన్ ద్వారా వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. గూగుల్ స్కాన్ లేదా క్యూఆర్ కోడ్‌తో ‘ఫీడ్‌బ్యాక్’ను స్కాన్ చేసి.. సమస్యలు, సూచనలను నేరుగా పంపించవచ్చు. ఇలా పంపిన మెసేజ్‌లు నేరుగా సీఎం పేషీకి, దేవదాయశాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి కార్యాలయాలకు వెళ్తాయి. తద్వారా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారు.
Updated Date – Apr 11 , 2025 | 11:34 PM