APPSC JL Exam Dates : ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ, టీటీడీ అండ్ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల నియామకాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే జూన్ 20, 21, 22 తేదీల్లో మాత్రం పరీక్షలు జరుగవని పేర్కొంది. ఈ మూడు రోజులు మినహా మిగతా అన్ని తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం సెషన్లలో జేఎల్ రాత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.