APPSC Group 2 Admit Card 2025 : ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అదికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే..

వాస్తవానికి 2024 జులై 28న జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. అప్పట్లో అభ్యర్థుల అభ్యర్థనల మేరకు ఈ పరీక్షలను వాయిదా వేశారు. అనంతరం 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే.. 2024 ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల్లో మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ కమిషన్ ప్రకటించింది. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 899 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనుంది.
మే 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవల ప్రకటించింది. ఈ పరీక్షలను మే 3 నుంచి 9 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే.. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (పాఠశాల విద్యాశాఖ), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్టు గ్రేడ్-2 (పర్యావరణ శాఖ), అసిస్టెంట్ లైబ్రేరియన్ (ఎన్టీఆర్ వర్సిటీ), జూనియర్ అసిస్టెంట్ (ఎన్టీఆర్ వర్సిటీ), ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్), లైబ్రేరియన్ (ఆరోగ్యశాఖ), అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఆర్థిక, గణాంకాల శాఖ), ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటికి సంబంధించిన పరీక్ష తేదీలు ఇటీవల ఏపీపీఎస్సీ కమిషన్ వెల్లడించింది.