APPSC DL, JL 2025 Examination Dates: ఏపీపీఎస్సీ లెక్చరర్‌ పోస్టులకు పరీక్షల షెడ్యూల్‌ 2025 వచ్చేసింది.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే? – Telugu Information | APPSC DL, JL 2025 Examination Schedule Launched, Verify right here full particulars

Written by RAJU

Published on:

అమరావతి, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPSC) తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, గవర్నమెంట్‌ డిగ్రీ, టీటీడీ అండ్‌ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్ల నియామకాలకు రాత పరీక్షలు జూన్‌ 16 నుంచి 26 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అయితే మధ్యలో జూన్‌ 20, 21, 22 తేదీల్లో మాత్రం పరీక్షలు జరుగవు. ఈ మూడు తేదీలు మినహా మిగతా అన్ని తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం సెషన్లలో రాత పరీక్షలు జరుగుతాయి. ఏ పరీక్ష ఎప్పుడనే వివరాలు ఈ కింది వివరణాత్మక షెడ్యూల్‌లో తెలుసుకోవచ్చు.

ఏపీ లెక్చరర్‌ పరీక్షల షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మే నెలాఖరు నాటికి తెలంగాణ గురుకుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మే నెలాఖరు నాటికి ప్రవేశాలు పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల్లో ఐదోతరగతి ప్రవేశాలకు ఇప్పటికే ప్రవేశ పరీక్ష కూడా పూర్తి చేశారు. అలాగే తొలి, రెండో విడత సీట్ల కేటాయింపులు కూడా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఎస్సీ గురుకుల సొసైటీ బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్ష కూడా పూర్తి చేసింది. త్వరలో సీట్ల కేటాయింపులు చేయనుంది.

ఇవి కూడా చదవండి

బీసీ గురుకుల సొసైటీలో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా.. ఏప్రిల్‌ 20న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 6,832 సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. మే నెలాఖరు నాటికి ప్రవేశాలన్నీ పూర్తి చేసి, జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభించాలని యోచిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights