ABN
, Publish Date – Apr 25 , 2025 | 10:19 PM
అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి అపోలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీని నిర్వహించారు.

హైదరాబాద్: అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి అపోలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీని నిర్వహించారు. 55 ఏళ్ల వ్యక్తి ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత అతనికి భుజం వద్ద తీవ్రమైన నొప్పి రావడంతో పాటు ఎడమ చేయి బలహీనంగా మారింది. దీంతో అతను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులను సంప్ర దించారు.
అతడిని పరిశీలించిన షోల్డర్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ మేశ్రం సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకు న్నారు. ‘బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్’ పద్ధతిలో చికిత్స చేసి భుజం పనితీరును జరిగేటట్లు చూశారు. ఆపరేషన్ తర్వాత భుజం జాయింట్ హెడ్ పొజీషన్ తిరిగి సరిచేసినట్లు డాక్టర్ ప్రశాంత్ మేశ్రం తెలిపారు. అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్నును ఉపయోగించినట్లు ఆయన వివరించారు.
Updated Date – Apr 25 , 2025 | 10:19 PM