విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, కార్పొరేట్ కార్యాలయం….కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 30 ఖాళీలు
2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 70 ఖాళీలు
విభాగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ – ఈఈఈ; డిప్లొమా-డీఈఈఈ
నెలవారీ స్టయిపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2021-2022లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
వయోపరిమితి: 18 ఏళ్లు నిండి ఉండాలి
అప్రెంటి్‌సషిప్ శిక్షణ కాలం: ఏడాది
ఎంపిక: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.apcpdcl.in/