తూర్పు గాలుల ద్రోణి, మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో నైరుతి, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.
—————————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమయిన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ:-
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.