AP Rains: వర్షాలు దంచుడే దంచుడు.. ఏపీలో వచ్చే 3 రోజులు ఆ ప్రాంతాల్లో వానలే వానలు – Telugu Information | Gentle To Average Rains In Andhra Pradesh, Particulars Right here

Written by RAJU

Published on:

నిన్నటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది. అయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. పశ్చిమ రాజస్థాన్ నుండి ఉత్తర విదర్భ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనం వాయువ్య మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఎగువ ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం & పొరుగు ప్రాంతాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది

రాయలసీమ:-
——————-

ఈరోజు, రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల రెండు రోజుల్లో సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కు వ గ పెరిగే అవకాశముంది, తరువాత గణనీయమైన మార్పులేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలో రాగల రెండు రోజుల్లో సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కు వ గ పెరిగే అవకాశముంది, తరువాత గణనీయమైన మార్పులేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights