
నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదిలి ఈరోజు అనగా ఏప్రిల్ 08, 2025న ఉదయం 08.30 గంటలకు నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణము వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. బాగా గుర్తించబడిన అల్పపీడన తీవ్రతను కొనసాగిస్తోంది. ఆ తరువాత ఇది దిశ మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ,తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. నిన్న ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ఈరోజు ఉపరితల ఆవర్తనం నుండి మధ్య మహారాష్ట్ర మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
——————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గమనిక:- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగే అవకాశముంది. తర్వాత పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలో రాగల మూడు రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి