AP POLYCET Reply Key 2025 : రేపే ఏపీ పాలిసెట్‌ ఆన్సర్‌ కీ విడుదల.. polycetap.nic.in ద్వారా చెక్‌ చేసుకోవచ్చు – ap polycet 2025 reply key examine at polycetap nic in

Written by RAJU

Published on:

AP POLYCET 2025 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీ పాలిసెట్‌ 2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

ఏపీ పాలిసెట్‌ ఆన్సర్‌ కీ 2025
ఏపీ పాలిసెట్‌ ఆన్సర్‌ కీ 2025 (ఫోటోలు– Samayam Telugu)

AP POLYCET 2025 Answer Key : ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పాలిసెట్‌ 2025 పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్‌కు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 94 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. అనంతరం మే 10వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రిలిమినరీ కీ, ఫలితాల కోసం అధికారక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ప్రవేశాలు కల్పించే సంస్థలు:

ఏపీ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీ పాలిసెట్‌ 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రక్రియ మార్చి 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 15 వరకు కొనసాగింది. అనంతరం ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights