ABN
, Publish Date – Apr 24 , 2025 | 08:07 PM
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు సీఎం ఆమోదం తెలిపారు.

AP pensions
AP pensions: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నెలకు రూ.4 వేలు చేసిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు సైతం నెల రూ.6 వేలు ఇస్తోంది. ఒకటో తేదీ ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరీ పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేయనున్నారు.
Updated Date – Apr 24 , 2025 | 08:09 PM