అమరావతి, ఏప్రిల్ 16: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Former MP Vijayasai Reddy) రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు ఏపీ సిట్ (AP SIT)ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఆయన సమాచారం అందించారు. విజయసాయిని తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సిట్‌కు మాజీ ఎంపీ సమాచారం పంపారు. దీంతో 17వ తేదీన విచారణకు రావాలని, తాము రెడీ అంటూ విజయసాయికి సమాచారం పంపారు సిట్ అధికారులు.
మద్యం కుంభకోణం కేసులో ఏపీ సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా నిన్న (మంగళవారం) విజయసాయికి సిట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ ముందగానే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో 17నే వస్తానని సిట్ అధికారులకు సమాచారం పంపగా.. అందుకు తాము రెడీ అంటూ సిట్ స్పష్టం చేసింది. గతంలో కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డిని విజయవాడ సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. ఈ సమయంలో మద్యం కుంభకోణానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌కసిరెడ్డే అని, ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులకు కూడా చెబుతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వద్ద ఉన్న సమాచారాన్నిసేకరించేందుకు మాజీ ఎంపీకి ఏపీ సిట్ బృందం నోటీసులు పంపించింది.
కసిరెడ్డికి మరోసారి నోటీసులు

మరోవైపు ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయాన్ని నోటీసుల్లో పేర్కొంది. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఇప్పుటికే మూడు సార్లు రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్లన్నీ స్విచ్‌ఆఫ్ రావడంతో గత రెండు రోజుల నుంచి సిట్ దర్యాప్తు బృందాలు హైదరాబాద్‌లో ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతర శ్రేయోభిలాషుల కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. కసిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు.
గత రాత్రి నోటీసులు అంటించడంతో పాటు.. ఈరోజు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈనెల 19న విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన సిట్.. ఆయా సంస్థల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు. నేడో, రేపో వీరికి సిట్ నోటీసులు వెళ్లనున్నాయి. అదే విధంగా రాజ్ కసిరెడ్డి తండ్రికి కూడా నోటీసులు ఇచ్చి.. ఆయనను కూడా విచారణకు పిలిపించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Amaravati Development Plan: అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 16 , 2025 | 03:39 PM