AP Information: మండే వేసవిలో చల్ల చల్లని కబురు.. ఆ ప్రాంతాలకు జోరున వర్షాలు.. – Telugu Information | Reduction from Heatwave: Andhra Pradesh Braces for Three Day Rain Spell

Written by RAJU

Published on:

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. అని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

ఉపరితల ద్రోణి, ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఇవి కూడా చదవండి

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 – 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 – 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

ఈరోజు:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 – 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification