AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్

Written by RAJU

Published on:

విజయవాడ: ఏపీ ఐసెట్‌-2023 ఫలితాలు (AP ICET Results) విడుదలయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. తొలి మూడు ర్యాంకుల్లో అబ్బాయిలు సత్తా చాటారు.

టాప్‌-10 ర్యాంక‌ర్లు వీళ్లే:

1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట)

2. సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్‌)

3. పుట్లూరు రోహిత్‌ (అనంతపురం)

4. చింతా జ్యోతి స్వరూప్‌ (విజయనగరం)

5. కానూరి రేవంత్‌ (విశాఖపట్నం)

6. అఫ్తాద్‌ ఉద్దీన్‌ (పశ్చిమగోదావరి)

7. అభిషేక్‌ (విశాఖపట్నం)

8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ)

9. పిరతి రోహన్‌ (బాపట్ల)

10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి)

Updated Date – 2023-06-15T15:22:07+05:30 IST

Subscribe for notification