AP ICET 2025 Examination Date: ఐసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే – Telugu Information | Andhra Pradesh ICET 2025 Examination to be held on Might 7, Verify full particulars right here

Written by RAJU

Published on:

అమరావతి, మార్చి 24: రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 9, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులె స్వీకరించనున్నట్లు ఐసెట్‌ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం శశి ఓ ప్రకటనలో తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 28 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.650, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

మే 7న పరీక్ష రెండు షిఫ్టల్లో ఉంటుంది. ఉదయం షిఫ్ట్‌ 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌ 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2025.
  • రూ.1000 ఆలస్య రుసుమతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 14, 2025.
  • రూ.2000 ఆలస్య రుసుమతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19, 2025.
  • రూ.4000 ఆలస్య రుసుమతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 24, 2025.
  • రూ.10,000 ఆలస్య రుసుమతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2025.
  • ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణ తేదీలు: ఏప్రిల్ 29, 30 తేదీల్లో
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: మే 2, 2025 నుంచి ప్రారంభం
  • పరీక్ష తేదీ: ము 7, 2025.
  • ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల తేదీ: మే 10 సాయంత్రం 5 గంటలు
  • అభ్యంతరాల స్వీకరనకు చివరి తేదీ: మే 12 సాయంత్రం 5 గంటల వరకు
  • ఫలితాల విడుదల తేదీ: మే 21, 2025.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification