AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్!

Written by RAJU

Published on:


ABN
, First Publish Date – 2023-06-14T10:56:46+05:30 IST

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు..

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్!

AP EAPCET

విజయవాడ: ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్‌-2023 నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 3.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఉన్నత విద్యామండలి 25 శాతం వెయిటేజీ ఇవ్వడంతో నార్మలైజేషన్‌ ప్రక్రియ కోసం ఫలితాల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఇదిలా ఉంటే మంగళవారమే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 39.61 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంజినీరింగ్ విభాగంలో 2,24, 724 మంది పరీక్ష రాయగా.. 1,71, 514 మంది అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 90, 573 పరీక్ష రాయగా.. 81,203 మంది అర్హత సాధించారు.

ఉత్తీర్ణత…

ఇంజినీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణత

వ్యవసాయ కోర్సుల్లో 89.65 శాతం ఉత్తీర్ణత

Updated Date – 2023-06-14T11:04:12+05:30 IST

Subscribe for notification