ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు సీఐడీ విభాగంలో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) విభాగంలో కేటగిరీ B టెక్నికల్, ఇతర ట్రేడ్‌ల కింద 28 మల్టీ-స్కిల్డ్ హోమ్ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం (ఏప్రిల్ 28) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 28 హోంగార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పని సరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి. కనీస విద్యార్హతల కింద.. ఇంటర్మీడియట్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 2025 మే 1 నాటికి అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషుల ఎత్తు 160 సెం.మీ, మహిళల ఎత్తు 150 సెం.మీ ఉండాలి. ఎస్టీ మహిళా అభ్యర్థులకు 5 సెం.మీ. మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు దారులకు తప్పనిసరిగా కంప్యూటర్ నైపుణ్యాలతోపాటు చెల్లుబాటు అయ్యే LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 1, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు రిజిస్టర్డ్ పోస్టులో పోస్టు చేయవచ్చు. లేదంటే ఈ చిరునామాకు వెళ్లి నేరుగా దరఖాస్తులు సమర్పించొచ్చు. మే 15, 2025వ తేదీలోగా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. కేవలం ధ్రువపత్రాల పరిశీలనతో పాటు శారీరక కొలతల పరీక్ష, కంప్యూటర్, టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలకు 94407 00860 సీఐడీ కంట్రోల్ రూం ఫోన్ నంబర్‌ను పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక CID వెబ్‌సైట్ నుంచి వివరణాత్మక నోటిఫికేషన్, అర్హత మార్గదర్శకాలు, దరఖాస్తు ఫారమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
అడ్రస్..
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్, మంగళగిరి-522503
ఇతర వివరాలు CID వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.